* గడప గడపకు బి.ఆర్.ఎస్ పార్టీ* ప్రచారం
చంద్ర న్యూస్ ( మహమ్మదాబాద్ మండల) ప్రతినిధి నవంబర్ 5:
మహ్మదాబాద్ మండలం నంచర్ల గ్రామం నుండి కొందరు బీ.ఆర్.ఎస్ పార్టీ కార్యకర్తలు ఇంటింటికి డోర్ టు డోర్ ప్రచారం భాగంగా పరిగి పట్టణ ప్రాంతంలో భాగంగా బి.ఆర్.ఎస్ పార్టీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రతి గడప గడపకు ప్రచారం నిర్వహించడం జరిగింది బి.ఆర్.ఎస్ పార్టీ పథకాల గురించి ఇంటింటికి ప్రచారాన్ని మొదలుపెట్టారు 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఏం అభివృద్ధి జరగలేదని ఎంతోమంది అమరవీరుల ప్రాణత్యాగలతో అమర దీక్ష చేపట్టి తెలంగాణను సాధించారు అయినా కెసిఆర్ గారి. 10 ఏళ్ల పరిపాలనలో చేసిన పథకాలు రైతుబంధు 24 గంటలు కరెంట్ సరఫరా పెంచారు రైతు బీమా మిషన్ భగీరథ కళ్యాణ లక్ష్మి ఇంకా ఎన్నో పథకాలు అందించారు ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా ఎన్నో ఉన్నాయి అంటూ ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా నంచర్ల గ్రామ ఎంపీటీసీ పద్మమ్మ అడివెయ్య , మాజీ వార్డ్ నెంబర్ బ్యాగరి వెంకటయ్య, రామచంద్రయ్య, దస్తయ్య, వెంకటయ్య ,కాశీం ,కృష్ణయ్య, చంద్రయ్య ఓగులప్ప ,తదితరులు పాల్గొన్నారు