*ఆ పార్టీ చెప్పేవన్నీ లంగ హామీలు.......*
*మోడీ సిలిండర్ ధర పెంచుతూ పోతాడు.. కేసీఆర్ 400కే మీకిస్తాడు..*
*కేసీఆర్ బీమా ఓ మానవీయపథకం..*
*సాగునీరు లేక ఒక్క ఎకరం కూడా ఎండొద్దన్నదే నా లక్ష్యం...*
*చెక్‌డ్యాంలు నిర్మించి రెండు పంటలకు నీటి సౌలత్ కల్పించాను
*-వేల్పూర్ మండలంలో మంత్రి ప్రశాంత్‌రెడ్డి ఎన్నికల ప్రచారం..*
*- బోనాలు, వలగొడుగులతో బ్రహ్మరథం పట్టిన గ్రామాలు..*
చంద్ర న్యూస్ వేల్పూర్ నవంబర్ 5
కాంగ్రెస్ పార్టీ చెప్పే మాటలన్నీ మాయమశ్చీంద్ర మాటలనేనని అవి విని మోసపోవద్దని ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి, బాల్కొండ బీఆరెస్ అభ్యర్థి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ఆదివారం బాల్కొండ నియోజకవర్గంలోని వేల్పూర్ మండలం పచ్చలనడ్కుడ, కొత్తపల్లి, వాడి గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయనకు ఆయా గ్రామాల్లో వలగొడుగులతో, బోనాలతో రైతులు, మహిళలు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. మంత్రి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ చెప్పేవన్నీ లంగ మాటలేనని, దానికి నిదర్శనం కర్ణాటకలో మోసపోయిన ప్రజలనేని ఆయన అభివర్ణించారు. కర్ణాటకలో గెలిస్తే ఏడు గంటల కరెంటును పది గంటలకు పెంచుతామని హామీ ఇచ్చి.. ఉన్న ఏడు గంటల్లో ఐదు గంటలు కూడా సరిగ్గా ఇవ్వడం లేదని అన్నారు. పొద్దున, రాత్రి కరెంటు ఇస్తూ మళ్లీ పాతరోజులను కాంగ్రెస్ పార్టీ గుర్తు చేస్తున్నదని ధ్వజమెత్తారు. ఇక్కడ గ్రామల్లోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు లంగ మాటలు చెప్పి ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తారని, తెలంగాణ రాకముందు పదేళ్లపాటు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉందని, అప్పుడెందుకు ఈ పథకాలన్నీ అమలు చేయలేకపోయాయని ప్రశ్నించారు. దేశంలో మరో నాలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అక్కడ తెలంగాణలో లాగా ఆడబిడ్డ పెళ్లికి కళ్యాణలక్ష్మీ, రైతుకు పంట పెట్టుబడికి రైతుబంధు, దురదృష్టావశాత్తు రైతు మరణిస్తే రైతుబీమా లాంటి పథకాలు లేవన్నారు. ప్రధాని మోడీ గ్యాస్ ధరను పన్నెండు వందలకు పెంచాడని, ఇంకా ఇంకా పెంచుతాడని... ఎంత పెంచినా కేసీఆర్ మాత్రం నాలుగు వందలకే సిలిండర్ ఇప్పించి మిగిలిన భారాన్ని భరిస్తాడని అన్నారు. ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా .... అమెరికాలో కూడా లేని విధంగా మానవీయ కోణంలో కేసీఆర్ బీమా పథకాన్ని ప్రవేశపెట్టనున్నారని ... భూమి లేని వారింట్లో కూడా కుటుంబ పెద్ద మరణిస్తే బీమా కింద ఐదు లక్షల రూపాయలిచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకుంటారన్నారు. మళ్లీ మన ప్రభుత్వం రాగానే రేషన్ కార్డుపై సన్నబియ్యం అందిస్తామని, ఎన్నికలకు కాగానే 3 వేలకు పెంచి ప్రతీ ఏడాది ఐదు వందల చొప్పున పెంచుతూ ఐదు వేల పింఛన్ అందిస్తారని వివరించారు. రైతుబంధును వెంటనే పన్నెండు వేల రూపాయాలకు పెంచి క్రమంగా ఐదేండ్లలో పదహారు వేలకు పెంచి ఇస్తారని అన్నారు. కొత్త బీడీ పీఎఫ్ వచ్చినవారికి కూడా బీడి పింఛన్ కోసం సీఎం కేసీఆర్ కు విన్నవిస్తే ఒప్పుకున్నారని తెలిపారు. కొత్తపల్లి మీదుగా చింతలూరు మీదుగా డబుల్ రోడ్డు వేయించానని, వాగుల్లో చెక్ డ్యాంలు నిర్మించానని మంత్రి గుర్తు చేశారు. పచ్చలనడ్కుడలో మాట్లాడుతూ.. చెరువుల్లో నీళ్లు లేక పంటలు పండడం లేదని గ్రామస్తుల బాధపడితే.. సైకిల్ మోటర్‌పై వెళ్లి చెరువులను, పంట పొలాలను పరిశీలించానని గుర్తు చేశారు. పరిష్కారం కోసం చింతలూరు దగ్గర వాగులో చెక్‌డ్యాం నిర్మించి గేటు ఏర్పాటు చేసి వాగులో వరద పచ్చలనడ్కుడ చెరువులోకి వచ్చేలా చేశానన్నారు. దీంతో చెరువులోకి ఇప్పిటికీ నీళ్లు వస్తూ నీటితో కళకళలాడుతున్నదన్నారు. చెరువు ఆయకట్టు కాకుండా వాగు ఆయకట్టు రైతులకు కూడా సాగునీటి ఇబ్బందిని తీర్చేందుకు పచ్చలనడ్కుడ పైవైపు ఒక చెక్‌డ్యాం, కిందివైపు మరొక చెక్‌డ్యాం నిర్మించామని, దీంతో గ్రామంలో సాగునీటికి ఢోకా లేకుండా పోయి.. రెండు, మూడు పంటలు పండిస్తున్నారని గుర్తు చేశారు. నియోజకవర్గంలోని ఒక్క ఎకరం కూడా సాగునీరు లేక ఎండిపోకూడదన్న లక్ష్యంతో పనిచేస్తున్నానని అన్నారు. ప్యాకేజీ 21తో ఎస్సారెస్పీకి దూరంగా ఉన్న వేల్పూరులోని పలు గ్రామాలు, భీమ్‌గల్ మండలం, మోర్తాడ్, కమ్మర్‌పల్లి గ్రామాలకు సాగునీటి ఇబ్బందులు తీరిపోతాయన్నారు. మనం చేసిన పనులతో పది తరాలు బతికి బాగుపడాలనేదే తన తపన అని స్పష్టం చేశారు. పెట్రోల్, డీజీల్, గ్యాస్ ధరలు పెంచి అన్ని నిత్యావసరాల ధరలు పెరిగేందుకు బీజేపీ కారణమైందని విమర్శించారు. గరీబులకు మేలు చేయని ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వమని దుయ్యబట్టారు. వాడి,కొత్తపల్లి గ్రామానికి కలిపి సబ్ స్టేషన్ మంజూరు చేయిస్తానని గ్రామస్తులకు మాటిచ్చారు. డబుల్ రోడ్డు పనులు జరుగుతున్నాయని గుర్తు చేశారు.
ఈ కార్యక్రమం లో మండల,గ్రామ నాయకులు,కార్యకర్తలు,ప్రజాప్రతినిధులు ,ప్రజలు పాల్గొన్నారు