Type Here to Get Search Results !

బహుజన సమాజ్ పార్టీ లో చేరిన తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి నిజాంబాద్ జిల్లా అధ్యక్షులు అబ్బ గోని అశోక్ గౌడ్


ChandraNews : Nizamabad

బహుజన సమాజ్ పార్టీ లో చేరిన తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి నిజాంబాద్ జిల్లా అధ్యక్షులు అబ్బ గోని అశోక్ గౌడ్

 బీఎస్పీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ సాంబశివ గౌడ్ గార్ల ఆధ్వర్యంలో హైదరాబాదులో గల బీఎస్పీ పార్టీ కార్యాలయంలో బాల్కొండ నియోజకవర్గం నుంచి 50 మంది బిసి నాయకులతో పార్టీలో చేరిన అబ్బ గోని అశోక్ గౌడ్.

నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండ నియోజకవర్గంలో గల బీసీల సంఘటితం కోసం పార్టీలో చేరుతున్నట్టు అబ్బగోని అశోక్ గౌడ్ తెలిపారు.

డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మొట్టమొదటిసారి ఏ పార్టీ ప్రకటించని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాలలో బీసీలకు 70 సీట్లను కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నామని డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు.

బీసీల రాజ్యాధికారం కోసం పాటుపడుతూ బీసీల బానిస సంకెళ్ల విముక్తి కోసం పాటుపడుతున్నటువంటి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

అదేవిధంగా బాల్కొండ నియోజకవర్గం లో ఉన్నటువంటి ప్రతి మండలంలో ఉన్నటువంటి బీసీ నాయకులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు

గతంలో పూర్తి రాజకీయ పార్టీలలో, బిసి కుల సంఘాలలో కీలక పాత్ర పోషించిన వ్యక్తులు అబ్బ గోని అశోక్ గౌడ్ వెంట నడిచారు.


అబ్బగొని అశోక్ గౌడ్ మాట్లాడుతూ  బీఎస్పీ పార్టీలోకి ఆహ్వానించినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.

బీసీల రాజ్యాధికారం కోసమే అనుక్షణం బీసీల వెంటే ఉంటానని తెలిపారు.

నాపై నమ్మకం ఉంచి పార్టీలోకి ఆహ్వానించినందుకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి , రాష్ట్ర అధికార ప్రతినిధి సాంబశివ గౌడ్ గార్లకు మరియు నన్ను నమ్మి నాతో వచ్చినటువంటి

బీసీ నాయకులకు, బీఎస్పీ పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.


అబ్బ గోని అశోక్ గౌడ్

ఉమ్మడి నిజాంబాద్ జిల్లా అధ్యక్షులు

తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం, 

చిట్టాపూర్ 

బాల్కొండ నియోజకవర్గం.

కులం: గౌడ


2) దాసరి మూర్తి

తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం బాల్కొండ నియోజకవర్గం అధ్యక్షులు

కులం: పద్మశాలి,


3) కొప్పు రాజేందర్

తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు 

నిజామాబాద్,

కులం: ముదిరాజ్,


4)  గంగారం బీసీ సంక్షేమ సంఘం భీంగల్ మండల అధ్యక్షులు

బాల్కొండ నియోజకవర్గం

కులం: గంగపుత్ర (గుండ్ల)


4) రాకేష్ యాదవ్ 

తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం యూత్ అధ్యక్షుడు నిజాంబాద్ జిల్లా

బాల్కొండ నియోజకవర్గం


5) సతీష్ యాదవ్

బీసీ సంక్షేమ సంఘం మెండోర మండల అధ్యక్షులు

బాల్కొండ నియోజకవర్గం

కులం: యాదవ


6) షేక్ షాదుల్లా 

మైనారిటీ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు నిజాంబాద్

బాల్కొండ నియోజకవర్గం

బాల్కొండ

కులం: ముస్లిం


6)  మేదరి దశరథ్

బీసీ సంక్షేమ సంఘం బాల్కొండ నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి 


7) ప్రదీప్ 

మెండోరా

బీసీ నాయకులు

పూసల జిల్లా అధ్యక్షుడు

నిజామాబాద్ జిల్లా

బాల్కొండ నియోజకవర్గం


8) చాకలి ముత్తన్న

బీసీ నాయకులు

బాల్కొండ నియోజకవర్గం


9)  బొర్రన్న

భీమ్గల్ మండల బీసీ నాయకులు 

మాజీ సర్పంచ్ కుప్పగంటి

బాల్కొండ నియోజకవర్గం

కులం: యాదవ


10) దాసరి నరేష్ 

బీసీ నాయకులు 

బాల్కొండ నియోజకవర్గం 

కులం: పద్మశాలి


ఈ కార్యక్రమంలో బీఎస్పీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాంబశివ గౌడ్ , బీఎస్పీ నిజాంబాద్ జిల్లా అధ్యక్షులు పల్లికొండ నరసయ్య , దాదాపు 50 మంది బీసీ నాయకులతో పాటు ఎస్సీ ,ఎస్టీ మైనార్టీ ,బాల్కొండ నియోజకవర్గ బీఎస్పీ పార్టీ నాయకులు అత్యధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad