ChandraNews ; Nizamabad
బాల్కొండ మండలకేంద్రంలో అయ్యప్ప ఆలయం లో మాసపూజ అన్నదానం నిర్వహించారు. ప్రతినెల ఐదవ తేదీనా అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిస్టాపన దినోత్సవం సందర్బంగా అయ్యప్ప స్వామి ఆలయంలో గణపతి, సుభ్రమణ్యం, శ్రీచక్రమ్, అయ్యప్ప స్వామి లకు అభిషేకం చేసి పూజాకార్యక్రమాలు నిర్వహించారు. బాల్కొండ మండలకేంద్రానికి చెందిన వ్యాపారి తోడుపునూరి విశ్వనాధం, వారి కుమారులు ప్రసాద్, రాధాకృష్ణ లు అన్నదానం నిర్వహించారు. బాల్కొండ చుట్టుప్రక్కల నుండి అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం లో ఆలయ కమిటీ చైర్మన్ చౌటి కిషన్, కార్యవర్గ సభ్యులు మెడికల్ నరేందర్, అంబటి నవీన్, సాయినాథ్, శ్రీకర్, ఆలయ పూజారి గణేష్ జోషి, బలరాం సింగ్, రాము, పోశెట్టి, రాజేశ్వర్, సాయి కుమార్ తదితరులు ఉన్నారు.