Type Here to Get Search Results !

అక్రమ కట్టడాలకు ఆగడల్లేవ్.. మామూళ్ల మత్తులో అధికారులు*







 *అక్రమ కట్టడాలకు ఆగడల్లేవ్.. మామూళ్ల మత్తులో అధికారులు*

*చంద్ర న్యూస్ జిల్లా క్రైమ్ బ్యూరో హైదరాబాద్*

 1.9.23.హైదరాబాద్ నడిబొడ్డున నారాయణగూడ మిట్టల్ వాడి కాలనీలో అక్రమ కట్టడాలపై బల్దియా మామూళ్ల మత్తులో, నిద్ర పోతుందా అని అంటే అవునా అనే సమాధానం చెబుతున్నారు, వివరాలకు వెళ్తే నారాయణగూడ మిట్టల్ వాడ కాలనీలో ఓ వర్గానికి చెందిన వ్యక్తి ఇల్లు ఉంది అతని ఇంటి ముందట పబ్లిక్ రోడ్లో తన ఇంటి పైకి వెళ్లడానికి ఎలాంటి అనుమతులు లేకుండా లిఫ్టు పనులు నిర్మాణం చేపడుతున్నాడు, ఆ కాలనీ ప్రాంత ప్రజలు రోడ్డుపై లిఫ్ట్ నిర్మాణం చేయడంతో రాకపోకలకు చాలా ఇబ్బంది కలుగుతుంది ఇంటి యజమాని మహమ్మద్ గౌస్ కాలనీవాసులు ఇది పబ్లిక్ రోడ్డు దీనిలో మీరు లిఫ్ట్ నిర్మాణం చేస్తే మాకు చాలా ఇబ్బంది కలుగుతుందని ఎన్నిసార్లు మొరపెట్టుకున్న వినడం లేదు నిర్మాణం ఆపకపోవడంతో పాటుకాలనీవాసులను చంపుతామని బెదిరిస్తున్నారు కాలనీవాసులు ఇతని ప్రవర్తన పట్ల మళ్లీ బల్దియా అధికారులకు కంప్లైంట్ చేయగా, ఒక్కసారి వచ్చి కూడా ఇక్కడ పరిశీలన చేయకుండా ఎన్నిసార్లు కంప్లైంట్ చేసిన ఒక్కసారి కూడా రాకపోవడంపై అధికారులపై అనుమానం వ్యక్తం అవుతుంది ఇంటి ఓనర్ వద్ద బల్లి అధికారులు మామూళ్ల మత్తులో మునిగిపోతున్నారు అధికారుల నిర్లక్ష్యం పై హైకోర్టు లో (WP No.13898of 2023)లో జూన్ నెల 2023లో హైకోర్టు ఆదేశాల ప్రకారం స్టే ఆర్డర్ ఇచ్చినారు ఇట్టి ఆర్డర్ కాపీని బల్లి అధికారులకు దరఖాస్తు చేసిన హైకోర్టు ఆర్డర్ కాపీని లెక్క చేయకపోవడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి హైకోర్టు ఆదేశాల ప్రకారము పబ్లిక్ రోడ్లో లిఫ్టు కట్టడాన్ని ఆపేసి ఆ భాగాన్ని తొలగించి గుంతలను పూడ్చివేయాలని హైకోర్టు ఆర్డర్ ఇచ్చినారు ఈ ఆర్డర్ ని బల్లి అధికారులు పట్టించకపోగా ఇంటి ఓనర్ సెలవు దినంలో కొంచెం కొంచెం లిఫ్టు పనులు పూర్తి చేస్తున్న బల్లి అధికారులు ఇటు కన్నెత్తి చూడకపోవడం ఇంటి ఓనర్ తో బల్లి అధికారులు కుమ్మక్కై ఈ ఈ కట్టడానికి సహకరిస్తున్నారని ఆ కాలనీవాసులు ఆ ప్రాంత ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు దీనికి తోడుగా ఈ ప్రాంతానికి సంబంధించిన ఓ ఉన్నత అధికారి పోలీస్ అధికారి ఇంటి ఓనర్ కే మద్దతుగా వ్యవహరిస్తున్నారన్నది ఆరోపణలు వెలువెత్తుతున్నాయి పోలీస్ అధికారులు భూమి జాగాలో తలచుకోవద్దని పై అధికారులు ఎన్నో సందర్భాల్లో చెబుతున్నారు పోలీస్ పవర్ను అడ్డం పెట్టుకొని ఏదైనా చేయొచ్చా అని అహంకారం పనికి రాదని కాలనీవాసులు హెచ్చరిస్తున్నారు ఈ నిర్మాణాన్ని ఆపేయకపోతే బలియాపైన కోర్టు దిక్కుకారం కేసు వేస్తామని అదేవిధంగా బలియా మంత్రి కేటీఆర్ ఆఫీస్ వద్ద కాలనీవాసులు నిరాహార దీక్ష చేస్తామని బల్లి అధికారులకు హెచ్చరించారు తక్షణమే ఈ కట్టడాన్ని ఆపకపోతే తీవ్ర ఉద్రిక్తకు దారి తీస్తుందని కాలనీవాసులు హెచ్చరిస్తున్నారు

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad