ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థులకు మన టిఆర్ఎస్ పార్టీ స్వాగతం పలుకుతుంది.
- డా " నాగార్జున్ ( మన టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు)
ChandraNews : Hyderabad
హైదరాబాద్ రాష్ట్ర పార్టీ జాతీయకార్యాలయం బాగ్ లింగంపల్లి లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకున్న యువతీ యువకులకు స్వాగతం మన టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయదలచిన వారు పార్టీ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోగలరని కూర్చున్నాం పోటీ చేసే అభ్యర్థులకు బీఫామ్ లు ఇచ్చేందుకు మేము సిద్ధమని తెలిపారు మన టిఆర్ఎస్ పార్టీ వాట్సాప్ నెంబర్ కు మీ యొక్క పూర్తి బయోడేటా వాట్సప్ చేయగలరు 👉 88018 50555, 9705743999/94927 36064 లకు ఫోన్ చేయండి
అలాగే 119 సీట్లలో 63 సీట్లు బీసీలకే కేటాయించామని SC లకు 19,ST లకు 12, OC లకు 15, మైనార్టీలకు10 ఇస్తుందని తెలిపారు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ లందరూ ఏకమై రాష్ట్రంలో బీసీలు 62 శాతం ఉన్నప్పటికీ ఏ పార్టీ కూడా బీసీలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు మన టిఆర్ఎస్ పార్టీ ముఖ్య ఉద్దేశం బీసీల రాజ్యాధికారం మరియు బీసీని ముఖ్యమంత్రి గా ఉండడం . అందుకే 119 సీట్లలో 63 సీట్లు బీసీలకే కేటాయించామని తెలియజేస్తున్నాం ఇందులో పద్మశాలి కులం రాజకీయ అస్తిత్వాన్ని కోల్పోవడం జరుగుతుంది. రాష్ట్రంలో 119 సీట్లలో ఒక్క అసెంబ్లీ అభ్యర్థి కూడా పద్మశాలి లో లేకపోవడం చాలా దురదృష్టకరం కావున పద్మశాలీలు ఎక్కడి నుంచైనా పోటీ చేయాలనుకున్న మన టిఆర్ఎస్ పార్టీ బీఫామ్ ఇచ్చేందుకు మేము సిద్ధమని తెలియజేస్తున్నాము. మరియు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లలో ఉన్నటువంటి సీట్లలో వాళ్లకు బీఫాంలను ఇస్తామని అన్నారు. రాష్ట్రంలో ముఖ్యంగా బీసీలకు జరుగుతున్న అన్యాయం పట్ల పోరాటం చేయాలని బీసీలను చైతన్యం పరచాలని కోరారు. బీసీలు అందరూ ఏకమై దొరల గడీలను కుల్లగొట్టి బీసీల రాజ్యాధికారం తేవాలని కోరారు. ఇందుకు అన్ని వర్గాల వారు ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అందరూ కూడా బీసీలకు మద్దతు తెలుపుతున్నారని తెలియజేశారు ఈ దొరల పాలనలో ప్రజలు విసిగిపోయారని వాపోయారు కావున తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ ఓటుకు నోటు అమ్ముడు పోకుండా రాష్ట్ర ప్రజల భవిష్యత్తును ఆలోచించి సరైన నాయకుడికి ఓటు వేయాలని కోరారు కావున దయచేసి ఈసారైనా అధిక సంఖ్యలో బీసీ నాయకులను గెలిపించుకోవాలని కోరారు