*కోటి వృక్షర్చన కార్యక్రమంలో మెట్పల్లి మున్సిపల్
August 26, 2023
0
*కోటి వృక్షర్చన కార్యక్రమంలో మెట్పల్లి మున్సిపల్ ఆధ్వర్యంలో 12వ వార్డులోని అర్బన్ కాలనీలో ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు*
చంద్ర న్యూస్ : మెట్ పల్లి
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మెగా ప్లాంటేషన్ కోటి వృక్షర్చన కార్యక్రమంలో భాగంగా మెట్పల్లి మున్సిపల్ ఆధ్వర్యంలో 12వ వార్డులోని అర్బన్ కాలనీలో ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారు మున్సిపల్ చైర్మన్
రానావేణిసుజాత సత్యనారాయణ గార్లు వజ్రోత్సవాల్లో భాగంగా 1000 మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించి మొక్కలు నాటినారు
అనంతరం ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారు మాట్లాడుతూ తెలంగాణ వజ్రోత్సవంలో భాగంగా వెయ్యి మొక్కలు నాటే కార్యక్రమం ఈరోజు ప్రారంభించడం జరిగిందని దీనిలో భాగంగా అత్యధికంగా పండ్ల మొక్కలు నాటడం జరిగిందని అదే విధంగా పండ్ల చెట్లు విరివిరిగా పెంచి పట్టణ శివారు ప్రాంతాల్లో కూడా మొక్కలు పెంచడం జరుగుతుందని మెట్పల్లి పట్టణమును హరిత పట్టణంగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించినారు తెలంగాణ హరితహార తెలంగాణగా పేరు రావాలని ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని దశాబ్ది నుండి నాటే కార్యక్రమం చేస్తున్నారని అన్నారు
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రానవేణి సుజాత సత్యనారాయణ వైస్ చైర్మన్ బోయినపల్లి చంద్రశేఖర్ మున్సిపల్ కమీషనర్ జగదీశ్వర్ గౌడ్ కౌన్సిలర్స్ మరియు మున్సిపల్ అధికారులు పారిశుద్ధ కార్మికులు ఆర్పీలు తదితరులు పాల్గొన్నారు.