Type Here to Get Search Results !

నిద్ర లేచిన ‘‘కాగ్‌’’ -సంపాదకీయం

 


ఈ అవినీతి చిట్టా ఇక్కడితో ఆగిపోలేదు. టోల్‌ ప్లాజాలు అవినీతికి, ప్రయాణికుల దోపిడీకి నిలయాలుగా మారాయి. ‘‘కాగ్‌’’ ఉదాహరణ ప్రాయంగా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్నాటక, తమిళనాడు, కేరళలోని 41 టోల్‌ ప్లాజాల వ్యవహారాన్ని పరిశీలిస్తే రూ. 132.05 కోట్లు అక్రమంగా ప్రయాణికుల దగ్గర వసూలు చేసినట్టు తేలింది. అలాగే పౌర విమానయాన మంత్రిత్వశాఖ సామాన్యులకు కూడా విమాన ప్రయాణ సదుపాయం కల్పించడానికి ‘‘ఉడాన్‌’’ (సామాన్యులకు విమాన ప్రయాణ సదుపాయం) పథకం ప్రారంభించింది. 2021 మార్చి నాటికి ఈ సదుపాయాల్లో 52 శాతం మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. మిగతావాటి అంతు చిక్కడంలేదు. ఈ పథకాన్ని 2016లో ప్రారంభించారు. ఇందులో భాగంగా విమానాశ్రయాలను అభివృద్ధి చేయాలని కూడా సంకల్పించారు. కానీ తీరాచూస్తే 30 శాతం కూడా పూర్తి కాలేదు. రైల్వే మంత్రిత్వశాఖ కూడా అవినీతి, అక్రమాలు, అనుచిత ప్రవర్తన విషయాల్లో ఏ మాత్రం వెనకబడి లేదు. ఒక్క 2020-21లోనే అనుమతి లేకుండానే రూ. 8,127.97 కోట్లు ఖర్చు పెట్టేసింది. అలాగే 2021-22 లో అనుమతి లేకుండా రూ. 23, 805.4 కోట్లు వెచ్చించింది. ఈ డబ్బు దుర్వినియోగం అయిందా లేదా, అయితే ఎవరి జేబుల్లోకి ఎలా వెళ్లింది అన్నది ఇక్కడ ప్రశ్న కాదు. అనుమతి లేకుండానే ప్రజాధనాన్ని వెచ్చించడమే పెద్ద అవినీతి కింద లెక్క. ఇంకో వేపు ఖాదీ గ్రామీణ పరిశ్రమలశాఖ అధీనంలో చిన్న, మధ్య తరహా పరిశ్రమల వాణిజ్య కేంద్రాల ఏర్పాటులో 20శాతం అయినా పూర్తి కాలేదు. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ కింద వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు పింఛన్లు చెల్లిస్తారు. దక్కవలసిన వారికి పింఛన్లు చెల్లించకుండా ప్రధానమంత్రి మోదీకి అత్యంత ప్రీతిపాత్రమైన స్వచ్ఛ భారత్‌ ప్రచారానికి ఆ డబ్బు వెచ్చించారు. ఈ ఖర్చు 19 రాష్ట్రాలలోని అన్ని జిల్లాల్లో ఇలాగే వక్రమార్గం పట్టింది. స్వదేశ్‌ దర్శన్‌, అయోధ్య అభివృద్ధి పథకం చిట్టావిప్పినా ఇలాంటి అవినీతి, అక్రమాలే కనిపిస్తున్నాయి. అన్నా హజారే లోక్‌పాల్‌ కోసం ఉద్యమించినప్పుడు దానికి వెన్నుదన్నుగా ఉన్నది సంఫ్‌ు పరివారేనని అందరికీ తెలుసు. అవినీతి మీద యుద్ధం ప్రకటిస్తానని వాగ్దానం చేసి మోదీ అధికారం సంపాదించారు. అన్నా హజారే ఉద్యమ నేపథ్యంలోనే 2013లో అప్పటి యు.పి.ఎ. ప్రభుత్వం లోక్‌పాల్‌ వ్యవస్థ ఏర్పాటు చేసింది. 2014లో మోదీ అధికారంలోకి వచ్చిన తరవాత ఈ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఈ వ్యవస్థలో అయిదుగురు సభ్యులను నియమించాలి. ఇందులో నలుగురు న్యాయాధీశులు. ఒకరు ఇతరులు. ఈ అయిదుగురిని నియమించడానికి మోదీకి అయిదేళ్లు పట్టింది. అంటే మోదీ దృష్టిలో అవినీతి ఆకర్షణీయమైన నినాదమే మినహా ఆచరించదగిన ఆదర్శం ఎంత మాత్రం కాదు. ఈ మధ్యకాలంలో లోక్‌పాల్‌ నివేదికల ఊసే వినిపించడం లేదు. ఆ సంస్థ పని చేస్తోందో లేదో తెలి యని స్థితిలో పడిపోయింది. కానీ మళ్లీ ఎన్నికలకాలం వచ్చేస్తోంది కనక మోదీ అవినీతి గురించి ఇల్లెక్కి అరుస్తున్నారు. కాంగ్రెస్‌, బీజేపీయేతర ఇతర పార్టీలు అవినీతి నిలయాలని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. అన్నింటికీ మించి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ సంజయ్‌ మిశ్రా నియామకం, ఆయన పదవీ కాలం పొడిగింపు చట్టవిరుద్ధం అని సుప్రీంకోర్టు అభిశంసిస్తే ఆయన కోసం ఓ కొత్త వ్యవస్థ ఏర్పాటు చేస్తారన్న వార్తలు వస్తున్నాయి. సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టొరేట్లు ఆ వ్యవస్థకింద పని చేస్తాయట. దానికి అధిపతి సంజయ్‌ మిశ్రానేనట. ఇంతకన్నా ఘోరం ఏముంటుంది!

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad