కార్యకర్తలుకు అండగా బీఆర్ఎస్
బీఆర్ఎస్ పార్టీ ప్రమాద బీమా చెక్కును ఇంటికి వెళ్ళి అందజేసిన చొప్పదండి ఎమ్మెల్యే శ్రీ సుంకె రవిశంకర్అ నంతరం కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేసిన ఎమ్మెల్యే శ్రీ సుంకె రవిశంకర్ గారు కొడిమ్యాల మండలం అప్పారావుపేట గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త సిరిమల్ల రాజేశం రోడ్డు ప్రమాదంలో చనిపోయారు.
వారికి పార్టీ సభ్యత్వ ప్రమాద బీమా ఉండటంతో ప్రమాద బీమా చెక్కు మంజూరు అయ్యింది.ఈ చెక్కును ఎమ్మెల్యే వారి కుటుంబ సభ్యులకు అతని భార్య లక్ష్మి కి 2 లక్షల రూపాయల చెక్కును అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...
పార్టీకి కార్యకర్తలే కన్న బిడ్డలు అని అన్నారు.
ప్రతి కార్యకర్త ను పార్టీ కాపాడుకుంటుందని తెలిపారు.
పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం పార్టీ ఇన్సూరెన్స్ ను కార్యనిర్వాహక అధ్యక్షులు మంత్రి కేటీఆర్ గారు ప్రవేశపెట్టారని తెలిపారు.
కష్టపడే ప్రతి కార్యకర్తలను కుటుంబ సభ్యుడిగా చూసుకుంటానని అన్నారు