Type Here to Get Search Results !

బీజేపీ కార్యకర్త తండ్రి చనిపోగా రైతు బీమా

బీజేపీ కార్యకర్త తండ్రి చనిపోగా రైతు బీమా

 


ప్రొసీడింగ్ వారి ఇంటికి వెళ్ళి అందజేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీ సుంకె రవిశంకర్  దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతు బీమా పథకాన్ని అమలుచేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ గారు  కొడిమ్యాల మండలం అప్పారావుపేట  గ్రామానికి చెందిన బుర్ర గంగరాజు అనారోగ్యంతో చనిపోయారు. వారి కుటుంబానికి చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ గారు వారి ఇంటికి వెళ్లి 5 లక్షల విలువ గల రైతు బీమా ప్రొసీడింగ్ ను అందించారు. వారి పేరుతో భూమి ఉండటంతో రైతు బీమాకు అర్హులు కావడంతో వారికి రాష్ట్ర ప్రభుత్వం  ద్వారా 5లక్షల రూపాయల రైతు బీమా ప్రొసీడింగ్ ను చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ గారు వారి ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులకు అందించారు.v  ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మాట్లాడుతూ దేశంలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు బీమా పథకాన్ని ప్రవేశ పెట్టలేదని అన్నారు. రైతుల బాగోగుల గురించి ఆలోచించేది దేశంలోనే ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. రైతు చనిపోతే రైతు బీమా పథకం ద్వారా రైతులను ఆదుకున్న ఏకైక రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం,ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. తెలంగాణ ప్రభుత్వమే రైతులకు బీమా ప్రీమియం చెల్లిస్తుందని అన్నారు.  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఐసి తో ఒప్పందం చేసుకొని సంవత్సరానికి దాదాపుగా మూడు వేల కోట్ల రూపాయలు రైతుల తరపున బీమా ప్రీమియం కడుతుందని తెలిపారు. రైతుబీమా పథకం ద్వారా రైతు చనిపోయిన కుటుంబానికి ఆర్థిక భరోసాని ఇస్తుందని తెలిపారు. రైతుల కోసం రైతుబంధు పథకం ద్వారా సంవత్సరానికి ఎకరానికి 10వేల రూపాయలు ఇస్తున్న ఏకైక రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ప్రభుత్వం అని అన్నారు. రైతు పండించిన పంటను వారి ఊరిలోనే ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని అన్నారు. రైతుల కోసం రైతు కళ్ళాలు ఇవ్వడం జరిగింది వాటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలి. రైతుబీమా దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవ్వడం లేదని అన్నారు. రైతులకు నాణ్యమైన 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. 

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad