రైతులు ఆయిల్ పామ్ పంట సాగు చేసి లాభాలు గడించాలి

తెలంగాణలో పండగలా వ్యవసాయం
రైతుబంధు పథకం రైతుల రంది తీర్చింది
ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రైతులకు రైతు బంధు సహాయం
రైతులు వాణిజ్య పంటలు సాగు చేయాలి
చొప్పదండి మండలం చాకుంట గ్రామంలో ఎమ్మెల్యే శ్రీ సుంకె రవిశంకర్ ఆయిల్ పామ్ మొక్కలు నాటారు.
ఆయిల్ పామ్ సాగు చేసే రైతులు గుడిపాటి వెంకటరమణారెడ్డి, మల్లారెడ్డి అన్నదమ్ముల ఇద్దరిని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ సన్మానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...
రైతులు ఆయిల్ పామ్ పంట సాగు చేసి లాభాలు గడించాలి
ఆయిల్ పామ్ సాగు చేసే రైతులకు తెలంగాణ ప్రభుత్వ ప్రోత్సాహం
తెలంగాణలో పండగలా వ్యవసాయం
ఆయిల్ పామ్ సాగు రైతులకు సబ్సిడీ రూపంలో మొక్కలు అందడం అందజేయడం జరుగుతుంది. సబ్సిడీ డ్రిప్పు అందజేయడం జరుగుతుంది. పంట మొదలయ్యే నాలుగు సంవత్సరాల వరకు రైతుకు ఆర్థిక ప్రోత్సాహం అందజేయడం జరుగుతుంది.
దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుబంధు సహాయం అందుతుంది.
ఏడు సంవత్సరాల క్రితం తాగడానికి నీళ్లు లేని పరిస్థితి.
కరెంటు లేని పరిస్థితి.
ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చారిత్రాత్మక నిర్ణయం ద్వారా రైతులకు 24గంటల ఉచిత విద్యుత్, రైతు బంధు సహాయం, కాళేశ్వరం నీళ్ల ద్వారా సశ్యశామలం అయ్యింది.
రైతుబీమా ద్వారా రైతు ఏ కారణం చేతనైనా చనిపోతే 5లక్షల బీమా అందజేయడం జరుగుతుంది.
ఇది తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణం