నారాయణపేట జిల్లా శివారులోని కృష్ణ మండలం గూడబల్లూరు దగ్గర తెలంగాణలోకి ప్రవేశించారు రాహుల్‌గాంధీ. ఈ సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలికారు శ్రీధర్‌బాబు సహా పలువురు టీకాంగ్రెస్ నేతలు.
తెలంగాణలోకి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఎంట్రీ ఇచ్చింది. నారాయణపేట జిల్లా శివారులోని కృష్ణ మండలం గూడబల్లూరు దగ్గర తెలంగాణలోకి ప్రవేశించారు రాహుల్‌గాంధీ. ఈ సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలికారు శ్రీధర్‌బాబు సహా పలువురు టీకాంగ్రెస్ నేతలు. టైరోడ్ వరకు 3 కిలోమీటర్ల పాటు పాదయాత్ర కొనసాగనుంది. మహబూబ్‌నగర్-రాయచూర్ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇవాళ మక్తల్ నియోజకవర్గంలోకి యాత్ర అడుగుపెట్టినా మధ్యాహ్నం తర్వాత బ్రేక్ తీసుకుంటున్నారు రాహుల్. సోమవారం దీపావళి కావడంతో 24, 25, 26 తేదీల్లో పాదయాత్రకు విరామం ఇచ్చి ఢిల్లీ వెళ్తున్నారు. 27న మక్తల్, నారాయణపేట, దేవరకద్ర, మహబూబ్‌నగర్, జడ్చర్ల నియోజకవర్గాల మీదుగా నడక సాగిస్తారు. మొత్తం 12 రోజులు, 375 కిలోమీటర్లు మేర పాదయాత్ర సాగనుంది. ఏడు లోక్‌సభ, 17 అసెంబ్లీ నియోజకవర్గాల్ని టచ్ చేస్తూ.. రాహుల్‌గాంధీ యాత్ర ఉంటుంది.
కర్నాటకలోని రాయచూర్ నుంచి తెలంగాణలోకి యాత్ర ప్రవేశించాక.. టైరోడ్ వరకు 3 కిలోమీటర్లు కొనసాగుతుంది. నవంబర్ 7 వరకు తెలంగాణలో జోడో జోష్ ఉంటుంది.