నియోజకవర్గంలో వివిధ శాఖల ద్వారా జరుగుతున్న అభివృద్ధి
పనుల్లో వేగం పెంచాలి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గనికి చెందిన రోడ్లు, భవనాలు శాఖకు సంబంధిచిన రోడ్లు మరియు పంచాయితీరాజ్ శాఖకు సంబందించిన అభివృద్ధి పనుల స్థితిగతులపై శుక్రవారం నాడు వేల్పూర్ కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
పంచాయతీ రాజ్ శాఖ ద్వారా నియోజకవర్గంలో కొనసాగుతున్న అన్ని రకాల అభివృద్ధి పనుల వివరాలు అధికారులను అడిగి తెలుసుకుని పురోగతిలో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రిఆదేశించారు.
నియోజకవర్గంలో ఇప్పటి వరకు మంజూరైన పనులు పూర్తైన రోడ్లు,పురోగతిలో ఉన్న రోడ్లు,పనుల మొదలగు శంకుస్థాపనకు సిద్దంగా ఉన్న రోడ్ల వివరాలపై అధికారులను ఆరా తీశారు.
పంచాయతీ రాజ్ మరియు ఆర్ అండ్ బి పరిధిలో నిర్మాణ పనులు కొనసాగుతున్న రోడ్లను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. టెండర్ పూర్తి అయ్యి పనులు మొదలు పెట్టుకోడానికి సిద్దంగా ఉన్న రోడ్లకు సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమాలు త్వరలో ఏర్పాటు చేయాలని సూచించారు. ఇటీవల వరదలకు డ్యామేజ్ అయిన రోడ్లు, పిరియాడికల్ రిన్వల్ (PR) రోడ్లు పనులను త్వరితగతిన ప్రారభించడానికి కావలసిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
బాల్కొండ నియోజకవర్గంలో కొనసాగుతున్న డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణ పనులపై సమీక్షిస్తూ మోర్తాడ్,
బడాభీంగల్ లో నిర్మాణ పనులు పూర్తి అయినందున త్వరగా వాటిని ప్రారభించి లబ్ధిదారులకు అందజేయాలన్నారు.
ప్రస్తుతం పనులు కొనసాగుతున్న డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాల వద్ద కల్పించవల్సిన మౌళిక వసతులపై అధికారులను ఆదేశించారు.
లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరగాలని ఇందులో ఎలాంటి పైరవీలకు ఆస్కారం లేకుండా నిజమైన అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ సమీక్షా సమావేశంలో ఆర్డీవో శ్రీనివాస్,నియోజకవర్గ 2BHK ఇంచార్జ్ ఆఫీసర్ డిసిఓ సింహాచలం, ఆర్ అండ్ బి ఎ.ఈ నర్సయ్య,పంచాయతీ రాజ్ డీఈ లు మహేందర్ రెడ్డి,రాజేశ్వర్,తహిసిల్దార్లు రాజేందర్,బాబయ్య,శ్రీధర్
ఆర్డబ్ల్యుఎస్ డీ.ఈ అనిల్,NPDCL డీ.ఈ హరిచంద్ తదితరులు పాల్గొన్నారు.