(చంద్రన్యూస్) ఆర్మూర్ డివిజన్ఆగస్టు 25
కామారెడ్డి జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యాలయం లో మీడియా సమావేశంలో అసెంబ్లీ ఇంచార్జ్ కాటిపల్లి వెంకటరమణ రెడ్డి మాట్లాడుతూ.. కామారెడ్డి లో కెసిఆర్ అధికారం లోకి వస్తే భూ కబ్జాలు అరాచ కాలు పెరిగిపోతాయని అన్నారు.కేసీఆర్ పోటీ చేసే మరొక నియోజకవర్గం గజ్వేల్ లో జరుగుతున్న అవినీతి అక్రమాలు అరా చకాల పెరిగిపోయని ఆయన అన్నారు.కెసిఆర్ గెలిస్తే పోలీసు అధికారులు బిఆర్ఎస్ పార్టీ తొత్తులుగా వ్యవహరిస్తారని వారు అన్నారు.కామారెడ్డి లో కేసీఆర్ గెలిస్తే కామారెడ్డిని కే యూ డి ఏ కామారెడ్డి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీగా ఏర్పడి భూములను కబ్జా చేసి వారి కార్యకర్తలకు నాయ కులకు పంచి పెట్టడం జరుగుతుందని ఆయన వాపోయారు.ప్రజలు కేసీఆర్ చెప్పిన మాటలకు ఒక సారి రెండు సార్లు మోస పోయారనీ మూడో సారి మోసపోకుండ ఆలో చించి ప్రజలు తగిన మూల్యం చెల్లిస్తారని వారన్నారు.చిరువ్యాపారుల దగ్గర నాయకులు చేజాపడం మరియు వారికి ఇబ్బందులు గురి చేయడం జరుగుతుంది.అని వారి ఆరోపించారు.ఈ కార్యక్రమంలో కామారెడ్డి కౌన్సిలర్లు శ్రీకాంత్,అవధూత నరేందర్ చౌకీదారు నరేందర్ రెడ్డి మరియు భారతీయ జనతా పార్టీ నాయకులు మరియు కార్య కర్తలు ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.